లైవ్ వీడియో.. బాంబులు విసిరి కస్టడీ నుంచి పారిపోయారు

వెస్ట్ బెంగాల్ : పశ్చిమబెంగాల్ లోని ఈస్ట్ మిడ్నాపూర్ పాత రౌడీషీటర్లు అలజడి రేపారు. ముగ్గురు పాత రౌడీ షీటర్లను తమ కస్టడీలో విచారణ చేసిన పోలీసులు.. వాళ్లను తిరిగి కోర్టులో ప్రొడ్యూస్ చేసేందుకు తీసుకుని వెళ్తుండగా.. ఈ సంఘటన జరిగింది. పోలీసుల నుంచి తప్పించుకున్న పాత నేరస్తులు.. జనంపై నాటు బాంబులు విసురుతూ  పారిపోయేందుకు ప్రయత్నించారు. క్రిమినల్స్ పారిపోవడం , బెదిరించడం చూసి జనం అరుపులు, కేకలు పెట్టారు.

ముందుగా ఓ టూ వీలర్ ఎక్కి పారిపోయేందుకు ట్రై చేశారు. అది వెంటనే స్టార్ట్ కాలేదు. తర్వాత ముగ్గురు నిందితులు దానిపైనే పారిపోతుండగా.. స్థానికులు అడ్డుకోడానికి ప్రయత్నించారు.ఐతే…. అడ్డొచ్చిన వారిపై బాంబులు విసిరారు రౌడీషీటర్స్. అడ్డొస్తే చంపేస్తామంటూ బెదిరించారు. కొందరు తమ ఫోన్లతో ఈ వీడియోలు తీసి పోలీసులకు ఇచ్చారు.

ఈస్ట్ మిడ్నాపూర్ లోని కొంటాయ్ కోర్టుకు తీసుకుని వెళ్తుండగా.. రౌడీషీటర్స్ ఇంతటి దారుణానికి తెగబడ్డారు. బాంబులు విసరడంతో.. కొందరికి గాయాలయ్యాయి. ముగ్గురు నిందితుల్లో ఒకడైన కర్ణబేరాను పోలీసులు వెంబడించి పట్టుకుని అరెస్ట్ చేశారు. జనంపై బాంబ్ విసిరింది కూడా అతడే. మరో ఇద్దరు పారిపోయారు.

Posted in Uncategorized

Latest Updates