లొంగిపోయిన మావోదంపతులు

హైదరాబాద్‌ పోలీసుల ఎదుట వినోదిని, పురుషోత్తం అనే ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు. వీరిని హైదరాబాద్ నగర సీపీ అంజనీకుమార్ మంగళవారం మీడియా ముందు హాజరుపరిచారు. వీరిద్దరూ 2005-2014 మధ్యకాలంలో మావోయిస్టు అగ్రనేత ఆర్కే హయాంలో పనిచేసినట్లు అంజనీకుమార్‌ తెలిపారు. పురుషోత్తంపై రూ.8లక్షల రివార్డు ఉన్నట్లు సీపీ వివరించారు.

లొంగిపోయిన పురుషోత్తం అలియాస్ రవి, అతడి భార్య వినోదిని అలియాస్ భారతక్క ఇద్దరు హైదరాబాద్ అడ్డుగుట్టకు చెందినవారు. పురుషోత్తంది సాధారణ మధ్య తరగతి కుటుంబం. పురుషోత్తం అంబేద్కర్ విద్యానికేతన్ అప్పర్ ప్రైమరీ స్కూల్‌లో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశాడు. 1982లో పురుషోత్తం వినోదినిని పెళ్లి చేసుకున్నాడు. వినోదిని కూడా అడ్డగుట్ట ఏరియాలో టీచర్‌గా పనిచేసేది. వీరిద్దరూ 40 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లారు. టాప్ క్యాడర్‌లో పురుషోత్తం ఉన్నాడు.

Posted in Uncategorized

Latest Updates