లోకల్ రిచ్చెస్ట్ పార్టీలు : నెం.1ఎస్పీ… నెం.2 టీడీపీ

SPదేశంలోని అన్నీ ప్రాంతీయ పార్టీలలో ధనిక పార్టీ సమాజ్ వాద్ పార్టీ(SP) అని అసోసియేష్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ADR) రిపోర్ట్ తెలిపింది. ఇక రెండోస్ధానంలో తెలుగుదేశం పార్టీ(TDP)ఉంది.

2016-17 లో దేశంలోని 32 ప్రాంతీయపార్టీల మొత్తం ఆదాయం 321.03 కోట్లు ఉన్నట్లు రిపోర్ట్ తెలిపింది. ఇందులో అధికంగా ఎస్పీ(SP) రూ. 82.76 కోట్ల ఆదాయంతో మొదటిస్ధానంలో ఉండగా, రూ. 72.92 కోట్ల ఆదాయంతో తెలుగుదేశం పార్టీ(TDP) రెండోస్ధానంలో ఉంది. ఇక రూ.48.88 కోట్ల ఆదాయంతో మూడోస్ధానంలోఅన్నా డీఎంకే(AIADMK) పార్టీ ఉంది. మెత్తం 32 ప్రాంతీయ పార్టీల ఆదాయం రూ.321.3 కోట్లు ఉండగా… ఈ మూడు ప్రాంతీయ పార్టీల ఆదాయం మెత్తం రూ. 204.56 కోట్లుగా ఉంది. అంటే మెత్తం 32 ప్రాంతీయ పార్టీలలో ఈ మూడు పార్టీల వాటా 63.72 శాతంగా ఉంది. 2015-16, 2016-17 మధ్య కాలంలో ప్రాంతీయ పార్టీలకు ఎక్కువగా డొనేషన్లు, గ్రాంట్స్, బ్యాంక్, ఫిక్సిడ్ డిపాజిట్ల రూపంలో ఆదాయం వచ్చినట్లు ఈ నివేదిక తెలిపింది.  ఇక తమ ఆదాయంలో 87 శాతం పైగా ఇంకా ఖర్చు చేయలేదని ఎంఐఎం(MIM), జనతాదళ్ సెక్యూలర్(JDS) పార్టీలు తెలిపాయి. తమ ఆదాయంలో 67 శాతం ఇంకా ఖర్చు చేయలేదని TDP తెలిపింది. మరోవైపు తమ ఆదాయం కన్నా అధికంగా రూ. 81,88 కోట్లు ఖర్చు చేసినట్టు DMKపార్టీ తెలిపింది.

Posted in Uncategorized

Latest Updates