లోకేష్ జోస్యం : అమెరికాలోనూ టీడీపీ అధికారంలోకి

Lokesh-Nara-usaతెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి, సీఎం చంద్రబాబు కుమారుడు లోకేష్ బాబు సంచలన జోస్యం చెప్పారు. అమెరికాలో పర్యటనలో ఉన్న లోకేష్.. న్యూజెర్సీలో టీడీపీ కార్యకర్తలతో భేటీ అయ్యారు. సభను ఉద్దేశించి మాట్లాడారు. వారి ఉత్సాహం, అభిమానం చూసి మురిసిపోయారు. అమెరికాలో కూడా టీడీపీ అధికారంలోకి వచ్చేలా ఉందన్నారు. దీనికి అభిమానులు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టారు. టీడీపీ అభిమానుల సందడి, ర్యాలీలు చూస్తుంటే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినా ఆశ్చర్యం లేదన్నారు ఏపీ డైనమిక్ లీడర్ లోకేష్.
టీడీపీలో వన్ అండ్ ఓన్లీ చంద్రబాబునాయుడు నాయకత్వం మాత్రమే ఉంటుందని.. ఆయనే పార్టీ అంతా అన్నారు. నెంబర్ 2 ఎవరూ లేరన్నారు. టీడీపీ అభిమానులు ఉత్తేజం చూస్తుంటే.. అమెరికాలోనూ అధికారంలోకి వచ్చేట్లు ఉందంటూ పంచ్ వేశారు. మొన్ననే అండమాన్ లోనూ రెండు కౌన్సెలర్ స్థానాల్లో గెలుపొందిన తర్వాత.. అండమాన్ లోనూ పోటీ చేస్తాం అని చంద్రబాబు అప్పట్లో ప్రకటించారు. ఇప్పుడు అమెరికా ఎన్నికల్లోనూ పోటీ చేయాలనే ఆలోచనను లోకేష్ బయటపెట్టారు. లోకేష్ ఆలోచన చాలా బాగుందని.. టీడీపీ సత్తా అమెరికాలోనూ తెలియాలి అంటే.. పోటీ చేయాల్సిందే అంటున్నారు అమెరికాలోని టీడీపీ అభిమానులు.. ఏమైనా లోకేష్ గ్లోబల్ లీడర్ అంటున్నారు కార్యకర్తలు, అభిమానులు..

Posted in Uncategorized

Latest Updates