లోక్‌పాల్‌ నియామకం: కేంద్రానికి 10 రోజుల గడువు

supreamcourtలోక్‌పాల్‌ను ఎప్పుడు నియమిస్తారో స్పష్టంగా చెప్పాలని కేంద్రాన్ని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. లోక్‌పాల్‌ నియామకం కోసం తీసుకోనున్న చర్యలపై 10 రోజుల్లోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను జులై 17కు వాయిదా వేసింది. లోక్‌పాల్‌ నియామకం చేపట్టాలని సుప్రీంకోర్టు గతేడాదిలోనే కేంద్రాన్ని ఆదేశించింది. అయినా ప్రభుత్వం ఇంకా నియమించకపోవడంతో కామన్‌ కాజ్‌ అనే ఎన్జీవో సంస్థ  కోర్టులో ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేసింది. లోక్‌పాల్‌ నియామకంపై 10రోజుల్లోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని కోర్టు కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది.

 

Posted in Uncategorized

Latest Updates