లోక్‌ సభ ఎన్నికల్లో మేమే గెలుస్తాం : లక్ష్మణ్

 హైదరాబాద్‌‌ : త్వరలో జరిగే లోక్‌ సభ ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ పనిచేయదని, మెజారిటీ స్థానా లు తామే గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌. రాష్ట్రం లో కాంగ్రెస్, టీడీపీ ఖాళీ అయ్యాయన్నారు. శనివారం హైదరాబాద్‌ లోని బీజేపీ క్యాం ప్ ఆఫీస్‌ లో పార్టీ కోర్‌‌ కమిటీ సమావేశం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో పాటు లోక్‌ సభ ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలపై చర్చించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ మాట్లాడుతూ టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓటేస్తే టీఆర్ఎస్‌ కు వేసినట్టేనని అసెంబ్లీ ఎన్నికల ముందే చెప్పామని గుర్తుచేశారు. జనవరి 11, 12 తేదీల్లో ఢిల్లీలోజరిగే పార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశం తర్వాత లోక్‌ సభ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు లక్ష్మణ్‌.

Posted in Uncategorized

Latest Updates