లోక్ సభ ఆమోదం : బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా

జాతీయ OBC కమిషన్ బిల్లుకు గురువారం(ఆగస్టు-2) లోక్ సభ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన 123వ రాజ్యాంగ సవరణను పాస్ చేసింది లోక్ సభ. నేషనల్ కమిషన్ ఏర్పాటు చేసేందుకు తీసుకొచ్చిన 123వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్ సభ ఆమోదించింది.

బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది లోక్ సభ. మొత్తం 406మంది సభ్యులు బిల్లుకు మద్దతు తెలిపారు. ఒక్కరు కూడా వ్యతిరేకంగా ఓటు వేయలేదు. రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చకు సమాధానమిచ్చారు సామాజిక న్యాయం సాధికారతల మంత్రి తావర్ చంద్ గెహ్లాట్. మోడీ ప్రభుత్వం పేదలు, వెనకబడిన వర్గాల ఉన్నతి కోసం పనిచేస్తోందన్నారు. SC&STలకు ఇస్తున్న అన్ని బెనిఫిట్స్  BCలకూ ఇస్తామన్నారు. జామియా మిలియా, అలీగడ్ ముస్లిం యూనివర్సిటీల్లోనూ రిజర్వేషన్లు తెచ్చేందుకు ప్రయత్నిస్తోందన్నారు.

బిల్లుపై మాట్లాడిన టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్… బీసీల విషయంలో అన్ని పార్టీలు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ ఎప్పుడైనా బీసీలను హత్తుకుని ఉంటే వారి బాధ తెలిసి ఉండేదని రాహుల్ గాంధీపై సెటైర్లేశారు. 27%కోటా పూర్తిగా అమలు చేయనప్పుడు క్రీమీలేయర్ ఎందుకని ప్రశ్నించారు. అంతకుముందు జీరో అవర్ లో SC/ST చట్టం అంశాన్ని ప్రస్తావించారు కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ ఖర్గే. సుప్రీం కోర్టు ఆదేశాలపై ఆర్డినెన్స్ తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఖర్గేకు సమాధానమిచ్చిన హోంమంత్రి రాజ్ నాథ్ పాత చట్టాన్ని పునరుద్దరించే బిల్లు రెడీ అయిందని… ఈ సమావేశాల్లోనే పాస్ చేస్తామన్నారు.

ఇటు రాజ్యసభలో NRC అంశంపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు మరోసారి రచ్చ చేశారు. లంచ్ తర్వాత 2గంటలకు రాజ్యసభ ప్రారంభం కాగానే…  NRCపై హోంమంత్రి సమాధానం కోసం పట్టుబట్టారు. ఇందులో కలుగజేసుకున్న  ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్… అసోం నుంచి ఎన్నికైన సభ్యులకు మాట్లాడేందుకు చాన్స్ ఇవ్వాలన్నారు. హోంమంత్రిని సభకు పలిపించేందుకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి విజయ్ గోయల్ చెప్పారు. అసోం ఎంపీ భువనేశ్వర్ కలితాకు అవకాశమివ్వలేదని కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ ఆరోపించారు. అమిత్ షాను మాట్లాడనివ్వలేదని ఆనంద్ శర్మకు కౌంటర్ ఇచ్చారు ఆర్థికమంత్రి పీయూష్ గోయల్.

NRCపై షార్ట్ డ్యురేషన్ డిస్కషన్ కు అవకాశమిస్తామని చైర్మన్ వెంకయ్య నాయుడు చెప్పారు. అప్పుడు అసోం ఎంపీలంతా మాట్లాడేందుకు అవకాశం దక్కుతుందన్నారు. అయితే తృణమూల్ ఎంపీలు వెల్ లోకి దూసుకొచ్చి నినాదాలు చేయడంతో రాజ్యసభను వాయిదా వేశారు.  అంతకుముందు రాజ్యసభలో జీరో అవర్, క్వశ్చన్ అవర్ ప్రశాంతంగా జరిగాయి. సభ ప్రారంభం కాగానే… బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డ్స్ కు ఎంపికైన ప్రతిపక్ష నేత ఆజాద్, మాజీ మెంబర్ నజ్మా హెఫ్తుల్లాలకు అభినందనలు తెలిపారు చైర్మన్ వెంకయ్య.

Posted in Uncategorized

Latest Updates