లోక్ సభ ఈ నెల 26వరకు వాయిదా

లోక్‌సభ ఈ నెల 26వరకు వాయిదా పడింది. తిరిగి 27వ తేదీ ఉదయం 11 గంటలకు సభ సమావేశం కానుంది. ఇవాళ (శుక్రవారం) ఉదయం సభ ప్రారంభమైనప్పటినుంచి ప్రతిపక్ష పార్టీల సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ సభలో గందరగోళం సృష్టించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్‌ చేస్తూ TDP సభ్యులు ప్లకార్డులతో నినాదాలు చేశారు. AIADMK, కాంగ్రెస్‌ సభ్యులు తమ డిమాండ్లపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ స్పీకర్ పోడియం ముందు నిరసన తెలిపారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడటంతో సభను 27వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ సుమిత్రా మహాజన్ ప్రకటించారు.

 

Posted in Uncategorized

Latest Updates