లోక్ సభ ఎన్నికలపై త్వరలో నిర్ణయం : ర‌జ‌నీ

rajiniలోక్ సభ ఎన్నికలపై త్వరలోనే తన నిర్ణయం చెబుతామన్నారు సినీ నటుడు రజనీకాంత్. గురువారం (ఫిబ్రవరి-8) ఆయ‌న ప‌లు విష‌యాల‌పై  మీడియాతో మాట్లాడారు. క‌మ‌ల హాస‌న్‌తో క‌లిసి ముందుకు వెళ‌తారా? అని ప్ర‌శ్నించ‌గా ..రాజకీయాల్లో కలిసి ముందుకెళ్లే విషయం కమల్ హాసనే.. లేదా కాల‌మే నిర్ణయించాలని తెలిపారు. ప్రస్తుతం రజనీ, కమల్ వెబ్‌సైట్‌ల ద్వారా తమ పార్టీల కోసం సభ్యత్వాలు తీసుకుంటున్నారు. మరోవైపు సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంటున్నారు.

Posted in Uncategorized

Latest Updates