లోక్ సభ: ప్రోటోకాల్ పాటించలేదంటూ కాంగ్రెస్ రగడ

మధ్యప్రదేశ్ లో ఓ కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించకపోవడంతో లోక్ సభలో ఆందోళనకు దిగింది కాంగ్రెస్. గ్వాలియర్ హైవే ప్రారంభ కార్యక్రమ ఆహ్వానపత్రిక, శిలాఫలకంపై తన పేరు లేకపోవడంపై స్థానిక ఎంపీ జ్యోతిరాధిత్య సింథియా సీరియస్ అయ్యారు. లోక్ సభలో సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. శిలాఫలకంపై మొదట తన పేరు పెట్టారని.. తర్వాత దాన్ని తొలగించారన్నారు. దీనిపై కేంద్రమంత్రి గడ్కరీ క్షమాపణ చెప్పారు. స్థానిక అధికారుల తప్పిదంతో అలా జరిగిందని.. తన శాఖ తప్పిదానికి క్షమాపణ కోరుతున్నానన్నారు. గడ్కరీ క్షమాపణ చెప్పాక కూడా కాంగ్రెస్ గొడవ ఆగకపోవడంతో స్పీకర్ సీరియస్ అయ్యారు.

Posted in Uncategorized

Latest Updates