లోక్ సభ రేపటికి వాయిదా

Lok-Sabhaలోక్ సభ గురువారాని(ఏప్రిల్-5)కు వాయిదా పడింది.  బుధవారం(ఏప్రిల్-4) లోక్‌సభ సమావేశం ప్రారంభమైన వెంటనే వాయిదా పడింది. స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సభలోకి ప్రవేశించగానే అన్నా డిఎంకె సభ్యులు ప్లకార్డులు పట్టుకుని వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు. దీంతో సభను వాయిదా వేశారు స్పీకర్. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు సభ ప్రారంభమైనా… పరిస్థితిలో ఎటువంటి మార్పూ లేదు. అన్నాడీఎంకే సభ్యుల ఆందోళణల మధ్యే మంత్రులు పేపర్లు సమర్పించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సభ్యలు నినాదాల మధ్యే సభా వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ చెప్పారు. సభ్యులు తమతమ స్థానాలకు వెళ్లి కూర్చోవాలని స్పీకర్ పదేపదే విజ్ణప్తి చేసినా అన్నాడీఎంకే సభ్యులు విన్పించుకోలేదు. కావేరీ వాటర్ బోర్డు ఏర్పాటు చేయాలని, న్యాయం కావాలని నినాదాలు చేస్తూ సభా కర్యక్రమాలను అడ్డుకున్నారు. స్పీకర్ వెల్ లోకి దూసుకెళ్లి ఆమెకు అడ్డంగా నిలబడి అన్నాడీఎంకే ఎంపీలు నినాదాలు చేశారు. వీరి నినాదాల మధ్యే స్పీకర్ టీడీపీ, వైసీపీ తదితర పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలను చదివి వినిపించారు. సభ ఆర్డర్ లో ఉంటేనే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చే సభ్యుల సంఖ్యను లెక్కించి చర్చకు అనుమతించగలనని స్పీకర్ పదేపదే చెప్పారు. అయినా సభ ఆర్డర్ లో లేకపోవడంతో.. చివరికి సభను గురువారానికి వాయిదా వేశారు స్పీకర్ సుమిత్ర మహాజన్.

Posted in Uncategorized

Latest Updates