లోక్ సభ రేపటికి వాయిదా

LOKSABHAలోక్‌ సభ రేపటికి వాయిదా పడింది. 12వ రోజూ సభ తీరు మారలేదు. గురువారం (ఏప్రిల్-5) ఉదయం 11 గంటకు సభ ప్రారంభం కాగానే అన్నాడీఎంకే సభ్యులు ఆందోళన చేపట్టారు. కావేరీ యాజమాన్య బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ వారు స్పీకర్‌ వెల్‌లోకి వెళ్లి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. దీంతో స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. గంట వాయిదా అనంతరం ప్రారంభమైన సభలో మళ్లీ అదే సీన్ రిపీట్ అయ్యింది. అన్నాడీఎంకే సభ్యులు పట్టువీడకపోవడంతో సభలో గందరగోళం నెలకొంది. ఆ సమయంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్‌కుమార్‌ మాట్లాడుతూ.. అవిశ్వాసం సహా అన్ని అంశాలపై చర్చ చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయినా వారు వినిపించుకోకపోవడంతో స్పీకర్‌ సభను రేపటి (ఏప్రిల్-6)కి వాయిదా వేశారు.

Posted in Uncategorized

Latest Updates