లోక్ సభ సీట్లపై చర్చ : నితీష్ తో అమిత్ షా భేటీ

బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా బీహార్ లో పర్యటిస్తున్నారు. పాట్నాలో ఆయన బీహార్ సీఎం నితీష్ కుమార్ తో భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే సీట్ల పంపకంపై చర్చించేందుకే ఇద్దరు నేతలు భేటీ అయినట్టు తెలుస్తోంది. రీసెంట్ గా జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించి, బీజేపీతో పొత్తుపై తన నిర్ణయం ప్రకటించారు నితీష్. అందులో భాగంగానే గురువారం (జూలై-12) అమిత్ షాతో భేటీ అయ్యారు.

వచ్చే ఎన్నికల్లో 40 సీట్లున్న బీహార్ లో… బీజేపీ-జేడీయూ చెరో 17 సీట్లలో పోటీచేయాలన్నది ప్రతిపాదనతో ఉన్నారు. LJP, RSLPలాంటి ఎన్డీయే భాగస్వామ్య పార్టీలకు మిగతా ఆరుసీట్లను కేటాయించాలన్నది మరో అభిప్రాయం. గత ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 31 సీట్లొచ్చాయి. బీజేపీ స్వతహాగా 22 సీట్లు గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో జేడీయూ కేవలం 2 సీట్లకే పరిమితమైంది. ఇలాంటి పరిస్థితుల్లో సిట్టింగ్ సీట్లు వదులుకుని, జేడీయూకు భారీగా సీట్లు కేటాయింపు విషయంలో బీజేపీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే వాటన్నింటిపైనా సుధీర్ఘంగా చర్చించేందుకే అమిత్ షా బీహార్ వెళ్లినట్టు తెలుస్తోంది.

Posted in Uncategorized

Latest Updates