లోక్ సభ సోమవారానికి వాయిదా

Lok-Sabhaగందరగోళం మధ్య లోక్ సభ వాయిదా పడింది. ఏప్రిల్ 2వ తేదీ సోమవారానికి వాయిదా వేశారు సభని స్పీకర్ సుమిత్రా మహాజన్. అవిశ్వాసంపై కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇచ్చిన నోటీసులను ప్రస్తావించారు. చర్చ జరపటానికి సభ ఆర్డర్ లో లేదని తెలిపారు. అన్నాడీఎంకే ఎంపీలు కావేరి జలాల సమస్యని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పోడియం ఎదుట ఆందోళనకు దిగారు. సభ్యులు సీట్లలో కూర్చుంటే చర్చను అనుమతి ఇస్తానని స్పీకర్ పదే పదే చేసిన విజ్ణప్తిని పట్టించుకోలేదు అన్నాడీఎంకే ఎంపీలు.

ఈ సమయంలోనే కాంగ్రెస్ పక్షనేత ఖర్గే జోక్యం చేసుకున్నారు. నోటీస్ కు కావాల్సిన సంఖ్యా బలం ఉందని.. ప్ల కార్డులపైనే ఆయా పార్టీ ఎంపీల మద్దతు సంఖ్యను ప్రదర్శిస్తున్నాం అన్నారు. కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ ఎంపీల సంఖ్యను పరిగణలోకి తీసుకున్నా అవిశ్వాసం అనుమతికి కావాల్సిన సంఖ్యా బలం ఉందని.. వెంటనే చర్చ ప్రారంభించాలని కోరారు. అయితే సభ నిబంధనల ప్రకారం సభ్యులు అందరూ తమ తమ స్థానాల్లో ఉండాలని.. సభ ఆర్డర్ లో ఉన్నప్పుడే అవిశ్వాసం నోటీస్ పరిగణలోకి తీసుకోవటం జరుగుతుందని స్పీకర్ స్పష్టం చేశారు. ఎంతసేపటికీ సభ అదుపులోకి రాకపోవటం ఏప్రిల్ 2వ తేదీ సోమవారానికి వాయిదా వేశారు.

Posted in Uncategorized

Latest Updates