లోయలోకి జారుతున్న బస్సును ఆపాడు.. 80మంది సేఫ్.. కేరళలో రియల్ హీరో

తమిళనాడు : తమిళనాడు రాష్ట్రం ఇడుక్కిలో అద్భుతం జరిగింది. లోయలోకి జారిపోతున్న బస్సును ఆపి.. అందులోని 80 మందికిపైగా ప్రయాణికులను ఒంటిచెత్తో కాపాడాడు ఓ వ్యక్తి. సినిమాల్లో మాత్రమే కనిపించే ఇలాంటి సాహసాన్ని చేసి సూపర్ మ్యాన్.. రియల్ హీరో అనిపించుకుంటున్నాడు ఓ జేసీబీ డ్రైవర్.

తమిళనాడులో ఓ కొండ ప్రాంతంవైపు ఆ రాష్ట్ర ఆర్టీసీ బస్సు(TNSTC) వెళ్తోంది. బస్సులో 80మందికి పైగా ప్రయాణికులున్నారు. ఎక్కువ రద్దీ ఉన్న బస్సు…. ఎత్తువైపు వెళ్తుండటంతో… డ్రైవర్ కంట్రోల్ తప్పాడు. బ్రేకులు పడక పోవడంతో.. కంట్రోల్ తప్పి బస్సు వెనక్కి జారిపోతోంది. రోడ్డుకు కొద్ది దూరంలోనే ఉన్న ఇరుకైన భారీ లోయ వైపు జారిపోతోంది. ఊహించని ప్రమాదంలో పడేసరికి ప్రయాణికులంతా భయంతో అరుస్తున్నారు.

రోడ్డుమీద నుంచి దిగువకు జారిపోతున్న బస్సును కపిల్ అనే ఓ జేసీబీ డ్రైవర్ చూశాడు. వెంటనే పరుగెత్తి.. జేసీబీ తీసుకుని.. బస్సుకు ఎదురుగా వెళ్లాడు. గేర్ లోనే బండిని ఆపి… ఫ్రంట్ హ్యాండిల్ తో బస్సును ఆపేశాడు. మరింత కిందకు జారిపోకుండా బస్సు అక్కడే ఆగిపోయింది. ఆ పక్కనే భారీ లోయ ఉంది. బస్సు ఆగిపోవడంతో.. ప్రయాణికులంతా హడావుడిగా దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. తమ ప్రాణాలు కాపాడిన దేవుడివంటూ కళ్లవెంట నీళ్లు పెట్టుకుంటూ అతడికి ధన్యవాదాలు చెప్పారు. తమకు పునర్జన్మ ప్రసాదించిన దేవుడివంటూ దండం పెట్టారు. ప్రాణాలు దక్కడంతో జనం అంతా ఊపిరిపీల్చుకున్నారు.

కపిల్ కేరళలోని ఇడుక్కి ప్రాంతానికి చెందిన జేసీబీ డ్రైవర్. ఘాట్ రోడ్డులో జేసీబీతో తన షిఫ్ట్ లో రెగ్యులర్ వర్క్ చేస్తున్నాడు. జేసీబీ డ్రైవింగ్ లో అతడు మిస్టర్ పర్ఫెక్ట్. కొండప్రాంతాల్లో.. బురద రోడ్లలో.. రాతి కొండలపైనా అతడి దగ్గరున్న జేసీబీ వాహనం స్లిప్ కాకుండా.. కంట్రోల్ తప్పకుండా పనిచేస్తుంది. వాహనం డ్రైవింగ్ లో అనుభవం ఉన్న కపిల్.. సమయానికి బస్సును ఆపగలిగాడు. జనం అందరూ దిగిపోయారో లేదో తెల్సుకుని.. బస్సును మళ్లీ రోడ్డుపైకి నెట్టుకుంటూ వెళ్లాడు. ఓ గంటపాటు.. బస్సును అలా నడిపిస్తూ… రూట్ మారుస్తూ.. రోడ్డెక్కించాడు.

ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే కపిల్ పనిచేస్తుండటం..  బస్సు ప్రమాదాన్ని గుర్తించడం.. ఆలస్యం చేయకుండా తాను జేసీబీతో బస్సును ఆపడం ప్రయాణికుల అదృష్టం అని చెప్పాలి. లోయలోకి జారిపోతున్న బస్సును చూడగానే సమయస్ఫూర్తితో వెంటనే పరుగెత్తి , జేసీబీని బస్సువైపు నడపడం.. చివరకు దానిని ఆపడంలో ఆయన చూపిన తెగువ…. అతడిని సూపర్ మ్యాన్ ను చేసింది.

సినిమాల్లోనే ఇలాంటి సీన్స్ కనిపిస్తుంటాయి.. అలాంటి హీరోయిజం రియల్ లైఫ్ లో చూపించి  రియల్ హీరో అనిపించుకున్నాడు కపిల్. ఓ సింపుల్ జేసీబీ డ్రైవర్ కూడా హీరో అవుతాడనడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదు.

 

Posted in Uncategorized

Latest Updates