లోయలో పడిన బస్సు ..42 మంది మృతి

BUS ACCIDENTఉత్తరాఖండ్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం (జూలై-1) పౌరిగల్వార్‌ జిల్లా నైనిదండ దగ్గర ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో  42మంది  చనిపోయారు. మరో పదకొండు  మంది  తీవ్రంగా గాయపడగా వారిని హాస్పిటల్ కు  తరలించారు. NDRF  సిబ్బంది  సహాయక చర్యల్లో  పాల్గొంటున్నారు. లోయ లోతు  ఎక్కువగా ఉండడంతో బస్సు  నుజ్జునుజ్జు  అయింది. మృతుల  కుటుంబాలకు  2లక్షల ఆర్థిక  సాయం  ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం.  ఈ ప్రమాదంపై  దర్యాప్తునకు  ఆదేశించారు  ముఖ్యమంత్రి  త్రివేంద్ర సింగ్  రావత్. ప్రమాద స్థలాన్ని  స్వయంగా  పరిశీలించారు.

ప్రయాణికులతో రామ్‌ నగర్‌ నుంచి బస్సు భోహన్‌ కు బయల్దేరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు గల కారణాలు తెలియరాలేదు. బస్సులో లోయలో పడిన అనంతరం మరింత లోతుకు జారిపడటం వల్లనే మృతుల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది.

 

Posted in Uncategorized

Latest Updates