లోయలో పడిన బస్సు : 44 మంది మృతి

Peru_Crash22పెరూలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 44 మంది మృతి చెందారు. బుధవారం(ఫిబ్రవరి21) అర్ధరాత్రి సమయంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. 45 మంది ప్రయాణికులతో బయలుదేరిన బస్సు అర్ధరాత్రి ప్యాన్‌ అమెరికా హైవే సమీపంలో 260 ఫీట్ల లోయలోకి పడిపోవటంతో బస్సు నుజ్జునుజ్జు అయిపోయింది. తొలుత 35 మంది చనిపోయారని ప్రకటించిన అధికారులు.. తర్వాత 44 మృతదేహాలను వెలికి తీసినట్లు తెలిపారు. అయితే మార్గమధ్యంలో చాలా మంది బస్సు ఎక్కినట్లు క్షతగాత్రులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. ప్రమాద తీవ్రతతో చాలా మృతదేహాలు పక్కనే ఉన్న నదిలోకి ఎగిరిపడ్డాయి. వీటిని తీసేందుకు రక్షక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ‘ప్రమాదకరమైన మలుపు.. పైగా చీకట్లో డ్రైవర్‌ మార్గాన్ని సరిగ్గా అంచనా వేయకపోవటం’తోనే ఈ ఘోరం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

 

Posted in Uncategorized

Latest Updates