లోయలో పడ్డ బస్సు: 10 మంది మృతి

ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఆ రాష్ట్రానికి చెందిన బస్సు లోయలో పడింది. రిషికేశ్-గంగోత్రి హైవేపై ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు చనిపోగా… మరో 9 మంది గాయపడ్డారు. ప్రమాదానికి గురైన సమయంలో బస్సులో సుమారు 25 మంది ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.  సుమారు 250 మీటర్ల లోతులోకి బస్సు పడినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

Posted in Uncategorized

Latest Updates