లోయలో పడ్డ బస్సు: 30 మంది మృతి

మహారాష్ట్రలోని రాయిగడ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పొలందపూర్ దగ్గర ప్రైవేటు బస్సు 500 అడుగుల లోతు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 30మంది చనిపోయారు. శనివారం(జూలై-28) ఉదయం సతారా జిల్లాలోని మహాబలేశ్వర్ వెళ్తుండగా… అంబెనలీ ఘాట్ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. 35మందితో వెళ్తున్న ప్రైవేట్ బస్సు… లోయలో పడిపోయింది. వీరంతా మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా దాపోలీలో ఉన్న బాలాసాహెబ్ సావంత్ కొంకణ్ క్రిషి విద్యాపీఠ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ కి చెందిన స్టాఫ్, స్టూడెంట్స్ గా గుర్తించారు. వీరంతా పిక్నిక్ కోసం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలిస్తున్నారు. చికిత్స పొందుతున్న వారిలో 7 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

ప్రమాద సమాచారం అందిన వెంటనే… రాయిగడ్, సతారా జిల్లాల నుంచి NDRF, SDRF బృందాలను స్పాట్ కు పంపించారు. సహాయక చర్యలు మొదలుపెట్టిన సిబ్బంది ఒకరిని కాపాడారు. ఇప్పటి వరకు 13 మృతదేహాలను వెలికితీశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. మృతదేహాల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది.

Posted in Uncategorized

Latest Updates