లోయలో పడ్డ స్కూలు బస్సు : 16 మంది మృతి

 విహారయాత్రకు వెళ్లిన స్కూలు బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటన నేపాల్ లోని డాంగ్‌  జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. ప్రమాదం లో 16 మంది చనిపోగా.. 11 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్తితి విషమంగా ఉంది. ఈ ఘటనపై స్పందించిన అధికారులు గాయాలైనవారిని సమీప రప్తి జోనల్ దవాఖానా కు తరలించారు. బస్సులో మొత్తం 31 మంది ప్రయానించినట్లు అధికారులు తెలిపారు. వీరంతా గోరానిలోని క్రిష్ణసేన్ ఇచ్చుక్ టెక్నికల్ పాఠశాలకు చెందిన వారుగా గుర్తించామని చెప్పారు. మరిన్ని వివరాలు  తెలియాల్సి ఉంది.

Posted in Uncategorized

Latest Updates