లో వోల్టేజీని నివారించడంలో.. విద్యుత్ శాఖ అద్భుత ఫలితాలు : జగదీష్

కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే మొదటి ఫలితం సూర్యాపేట జిల్లాకే దక్కుతుందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. కోటి ఎకరాల సాగు లక్ష్యంగా ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో యావత్ దేశం తెలంగాణ రాష్ట్రం వైపు ఉందన్నారు. 24 గంటల ఉచిత కరెంటు, పెట్టుబడి పథకం, రైతుబీమాతో అన్నదాతలు సంబురాలు చేసుకుంటున్నారని చెప్పారు.

మంగళవారం (జూలై-17) సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం శాంతినగర్ లో కొత్తగా ఏర్పాటు చేసిన సబ్ స్టేషన్ ను మంత్రి ప్రారంభించారు. అంతకుముందు కోదాడలో అడ్వొకేట్లకు హెల్త్ కార్డుల పంపిణీలో మంత్రి పాల్గొన్నారు.  లో వోల్టేజీ సమస్యను నివారించడంలో విద్యుత్ శాఖ అద్భుత ఫలితాలు సాధించిందని వెల్లడించారు మంత్రి జగదీష్ రెడ్డి.

Posted in Uncategorized

Latest Updates