ల్యాండ్ డాక్యుమెంట్లలో జాప్యం : తహశీల్దార్ పై రైతు దాడి

భూమి కాగితాల కోసం తిరిగి తిరిగి వేసారిన ఓ రైతు.. ఆగ్రహం పట్టలేక ఏకంగా తహశీల్దార్ పైనే చేయిచేసుకున్నాడు. ప్రతిగా అధికారుల చేతుల్లో దెబ్బలు కూడా తిన్నాడు ఆ రైతు. వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం (జూలై-16) ఈ ఘటన చోటుచేసుకుంది.

ఎల్కతుర్తి మండలం సీతంపేట గ్రామానికి చెందిన రాజయ్య అనే రైతు.. చాలా రోజులుగా తన భూమికి సంబంధించిన డాక్యుమెంట్ల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. పని కావడం లేదు. సోమవారం కార్యాలయానికి వచ్చిన రైతు రాజయ్య నేరుగా తహశీల్దార్ మల్లేశం గదిలోకి వెళ్లాడు. భూమి కాగితాల కోసం నిలదీశాడు. ఐదు సంవత్సరాలుగా ఎందుకు తిప్పించుకుంటున్నారంటూ గట్టిగా అడిగాడు. దీంతో.. పక్కనే ఉన్న డిప్యూటీ తహశీల్దార్ మహ్మద్ ఇక్బాల్ రైతుపై దాడి చేశాడు. పక్కకు నెట్టేశాడు. తహశీల్దార్ నే కొడతావా అంటూ రాజయ్యపై దాడి చేశాడు. ఈ ఘటనపై అధికారులు పోలీసులకు కంప్లయింట్ చేశారు. రైతు రాజయ్యను స్టేషన్ కు తరలించారు. ఐదు సంవత్సరాలుగా రాజయ్యకు ఎందుకు భూమి కాగితాలు పెండింగ్ లో ఉన్నాయో.. ఎందుకు తిప్పించుకుంటున్నారో ఇప్పటి వరకు అధికారులు మాత్రం సమాధానం చెప్పలేదు.

Posted in Uncategorized

Latest Updates