ల్యాండ్ స్లైడ్ తీర్పు… భారీ విజయం దిశగా టీఆర్ఎస్

తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ వైపే నిలిచారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బంపర్ మెజారిటీ ఇచ్చారు. ల్యాండ్ స్లైడెడ్ తీర్పు ఇచ్చారు. ప్రతిపక్షాల అంచనాలను పటాపంచలు చేశారు. గులాబీ కోటలు కూలుతాయన్న అపోజిషన్ మాటలు నిజం కాలేదు. అధికార టీఆర్ఎస్ పార్టీకే మరోసారి బంపర్ మెజారిటీని కట్టబెట్టారు తెలంగాణ ఓటర్లు.

పది గంటలకు అందిన ఫలితాల ప్రకారం.. టీఆర్ఎస్ పార్టీ 90స్థానాల్లో లీడ్ లో కొనసాగుతోంది. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలతో కూడిన మహాకూటమి 15 సెగ్మెంట్లలో గెలుపు దిశలో పయనిస్తోంది. ఎంఐఎం మాజీ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ చాంద్రాయణగుట్టనుంచి గెలుపు జెండా ఎగరేశారు. మరో నలుగురు అభ్యర్థులు విన్నింగ్ రేసులో ఉన్నారు. బీజేపీ నాలుగు, ఇతరులు రెండు స్థానాల్లో గెలుపు బాటలో పయనిస్తున్నారు. పూర్తి వివరాలు ఒంటిగంటలోపు వచ్చే అవకాశం ఉంది.

Posted in Uncategorized

Latest Updates