వండర్ రికార్డ్స్ లో చోటు : డాన్స్ తో అదరగొట్టిన హైద్రాబాద్ చిన్నోడు

BOY DANCE RECORDతొమ్మిదేళ్ల చిన్నోడు..అందులోనూ దివ్యాంగుడు. అయినాసరే నాన్ స్టాప్ డాన్స్ తో ఇరగదీసి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ లో చోటు దక్కించుకున్నాడు. హైదరాబాద్ లోని దమ్మాయిగూడకి చెందిన తపష్ (9) అనే కుర్రాడు ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. బోయిన్‌ పల్లిలోని నేషనల్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్లీ హ్యాండీక్యాప్డ్‌ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా దమ్మాయిగూడ చెందిన భవానీ–లోకేష్‌ కుమారుడు తపష్‌ డ్యాన్స్‌ లో తన అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు.

హిప్‌ అప్, వెస్ట్రన్, బాలీవుడ్, మాస్‌ బీట్, ఫోక్‌  సాంగ్స్, పేట్రియాటిక్‌ సాంగ్‌ లకు అనుగుణంగా స్టెపులు వేస్తూ 35 నిమిషాల పాటు నిర్విరామంగా డాన్స్ చేసి ఆకట్టుకున్నాడు. ఈ కేటగిరీలో ఇప్పటి వరకు ఉన్న 18  నిమిషాల రికార్డును తపష్‌ బద్దలు కొట్టాడు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ నిర్వాహకులు.. బాలుడికి రికార్డు పత్రాన్ని, షీల్డ్‌ ను అందజేశారు. తమ చిన్నారికి సంగీతం పట్ల ఉన్న ఆసక్తి కొద్దీ ఆ దిశగా ప్రోత్సహించామన్నారు తపష్‌ తల్లిదండ్రులు.

 

Posted in Uncategorized

Latest Updates