వండి పెట్టె వారి బాగోగులు చూస్తాం: ఎంపీ కవిత

kavithaప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్న భోజన నిర్వాహకులకు గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేశారు మంత్రి ఈటల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత. సోమవారం(జులై-2) జిల్లాలోని ప్రభుత్వ హైస్కూల్లో జగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. భోజన నిర్వాహకులను ఉద్దేశించి ఎంపీ కవిత మాట్లాడారు. సీఎం కేసీఆర్ విద్యారంగం అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు.

విద్యార్థులకు భోజనం వండిపెట్టే మహిళలు కన్న బిడ్డల్లా చూసుకుంటున్నందుకు చేతులెత్తి మొక్కాలన్నారు. హరితహారంలో మొక్కలు నాటుతున్నామని, వంట చేసేందుకు వంటచెరకును ఉపయోగించడం కారణంగా చెట్లు తగ్గిపోతాయని ఆలోచన చేసినట్లు ఎంపీ తెలిపారు. భోజనం వండి పెడుతున్న మహిళలకు ఇస్తున్న వేతనం సరిపోవడం లేదంటున్నారని, విద్యార్థుల బాగోగులు చూస్తున్నట్లే.. వండి పెట్టె వారి బాగోగులు కూడా చూస్తామన్నారు కవిత.

అంతకు ముందు జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు ఎంపీ కవిత. కల్లెడ గ్రామంలో 100 డబుల్ బెడ్ రూంలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం అవసరమైన భూమిని సేకరించాలని సర్పంచ్ కు సూచించారు. వచ్చే ఎన్నికల్లో జగిత్యాలలో TRS గెలుస్తుందన్నారు కవిత.

Posted in Uncategorized

Latest Updates