వందకి 100 మార్కులు : సంస్కరణల అమలులో తెలంగాణ నెం.1

సంస్కరణల అమలులో తెలంగాణ రాష్ట్రం వంద శాతం స్కోర్ సాధించింది. ఢిల్లీలోజరిగిన స్టేట్ బిజినెస్ రిఫార్మ్ అసెస్ మెంట్ 2018 ఈవెంట్ లో  ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకులను ప్రకటించారు. సంస్కరణల అమలులో తెలంగాణతోపాటు ఏపీ, జార్ఖండ్, గుజరాత్ రాష్ర్టాలు వందశాతం స్కోర్ సాధించాయి. అసోం, తమిళనాడు రాష్ర్టాలు ఎక్కువ పురోగతి సాధించిన లిస్టులో ఉన్నాయి.

ర్యాంకింగ్ లో తెలుగు రాష్ట్రాలు మరోసారి పోటీపడ్డాయి. ఫీడ్ బ్యాక్ స్కోర్ లో ఏపీకంటే కాస్త వెనుబడింది తెలంగాణ. దీంతో ఫస్ట్ ప్లేస్ లో ఏపీ నిలిస్తే..తెలంగాణ సెకండ్ ప్లేస్ తో సరిపెట్టుకుంది. ఆస్తుల రిజిస్ట్రేషన్లలో ఛత్తీస్ గఢ్, పన్నుల చెల్లింపులో ఒడిశా, నిర్మాణ రంగ అనుమతుల్లో రాజస్థాన్, కార్మిక చట్టాల్లో పశ్చిమబెంగాల్, పర్యావరణ రిజిస్ట్రేషన్లకు సంబంధించి కర్ణాటక, భూమి లభ్యతలో ఉత్తరాఖండ్, యుటిలిటీ అనుమతుల్లో ఉత్తరప్రదేశ్, ఐటీ పారదర్శకతలో మహారాష్ట్ర రాష్ర్టాలు వంద శాతం స్కోర్ సాధించాయి.

సంస్కరణల అమలులో 9 రాష్ట్రాలు 95 శాతానికిపైగా స్కోర్ సాధించగా..6 రాష్ట్రాలు 90-95 శాతం, 3 రాష్ట్ర్రాలు 80-90 శాతం, 18 రాష్ట్రాలు 80 శాతం లోపు స్కోర్ సాధించాయి. 95 శాతం పైబడి సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలను టాప్ అచీవర్స్ గా గుర్తించారు.  90-95 శాతల మేర సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలను అచీవర్స్ గానూ 80-90 శాతం సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలను ఫాస్ట్ మూవర్స్ గానూ  80 శాతంలోపు ఉన్న రాష్ట్రాలను ఆస్పరైర్స్ గా గుర్తించారు.

Posted in Uncategorized

Latest Updates