వందలాది ట్యాక్స్ వివాదాల కేసులను కొట్టేసిన సుప్రీం

నెల రోజులుగా ట్యాక్స్ వివాదాలకు సంబంధించిన వందలాది కేసులను కొట్టేసింది సుప్రీంకోర్టు. ఈ వివాదాలను సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేయడానికి…కోటి రూపాయలకు తగ్గకుండా ఉండాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(CBDT) ఈ ఏడాది జులైలో మార్గదర్శకాలు ఇచ్చింది. ట్యాక్స్ వివాదాలకు సంబంధించిన కేసులు కోర్టులలో ఎక్కువ సంఖ్యలో పోగు పడటంతో CBDT ఈ పరిమితులను పెంచింది. గతంలో ఈ పరిమితి రూ.25లక్షలుగా ఉండేది.

CBDT గైడ్ లైన్స్ ప్రకారం…ట్యాక్స్ కు సంబంధించి కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల్లో దాదాపు 200కేసులను కొట్టేసినట్లు జస్టిస్‌ ఏకే సిక్రి నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల్లో దాదాపు 200కేసులను తొలగించినట్లు తెలిపింది. రూ.కోటి కంటే తక్కువ ఉన్న ట్యాక్స్ వివాదాలను ఆదాయపన్ను శాఖ పరిశీలించాలని ఆదేశించింది. దీంతో పెద్ద మొత్తంలో పన్ను వివాదాలు ఉన్న కేసులను త్వరగా పరిష్కరించేందుకు వీలు కానుంది. అయితే CBDT సర్క్యులర్‌ ప్రకారం మినహాయింపు కేసులను వేరుగా జాబితా తయారు చేయాలని కోర్టు రిజిస్టరీని కోరింది. మినహాయింపులో.. విదేశీ నల్లధనం, లేదా విదేశీ ఖాతాలకు సంబంధించిన కేసులు, ఐటీ చట్టం ప్రొవిజన్స్‌ చట్టబద్ధతపై సవాలు చేసే కేసులు, పన్ను విభాగాలు ప్రాసిక్యూషన్‌ చేపట్టిన కేసులు ఉంటాయి.

 

Posted in Uncategorized

Latest Updates