వందేళ్ల క్రితం నాటి వంతెనను కూల్చేశారు

మహారాష్ట్రలో కాలు నదిపై నిర్మించిన వందేళ్ల వంతెనను అధికారులు కూల్చివేశారు. థానే జిల్లాలోని ముర్బాద్-షాహాపూర్ పట్టణాలను కలుపుతూ కాలు నదిపై వందేళ్ల క్రితం వంతెన నిర్మించారు. ఈ వంతెన శిథిలావస్థకుంది. అది ప్రమాదకరంగా మారడంతో వాహనాల రాకపోకలను నిలిపేశారు. వంతెనను అధికారులు పేల్చివేశారు. కూల్చివేసిన పాత వంతెన స్థానంలో కొత్త బ్రిడ్జీని నిర్మించాలని ఇంజినీరింగ్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

Posted in Uncategorized

Latest Updates