వంశధారకు వ‌ర‌ద‌.. సురక్షితంగా బయటపడ్డ 52 మంది కూలీలు

ఆంధ్రప్రదేశ్  శ్రీకాకుళం జిల్లాలో పెద్ద ప్రమాదం తప్పింది.  వంశధార తీరంలో ఇసుక తోడేందుకు వెళ్లి వరద నీటిలో చిక్కుకుపోయిన 52 మంది కూలీలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు NDRF సిబ్బంది. నిన్న(ఆదివారం) సాయంత్రం శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం ఇసుక ర్యాంప్ లో నిన్న కూలీలు వరద నీటిలో చిక్కుకుపోయారు. 20 లారీల, 2 జేసీబీ డ్రైవర్లతో కలిపి మొత్తం రాత్రంతా వరద నీటిలోనే ఉన్నారు. ఒక్కసారిగా వంశధార నదిలో వరద ప్రవాహం పెరగడంతో వీరంతా చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు. విషయం తెలుసుకున్న జిల్లా అధికారులు వెంటనే NDRF సిబ్బందిని రంగంలోకి దింపారు. రాత్రి నుంచి జిల్లా కలెక్టర్, ఎస్పీ దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షించారు.  కూలీలను బయటకు తీసుకొచ్చారు. కూలీలంతా సురక్షితంగా బయటకు రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీకాకుళం జిల్లా వంశధార నదికి వరద ప్రవాహం పోటెత్తింది. దీంతో గొట్టా బ్యారేజ్  నుంచి అధికారులు నీటిని విడుదల చేశారు. వరద నీటి ప్రవాహానికి సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం రేవు ఇసుక ర్యాంప్  వద్ద 20 లారీలు, JCBలు వరదలోనే ఉన్నాయి. నదిలో 100 గొర్రెలు చిక్కుకోగా…. అందులో పదహారు గొర్రెలను కాపాడారు. మిగతా 84 గొర్రెలు నదిలో కొట్టుకుపోయాయి.

Posted in Uncategorized

Latest Updates