వచ్చి తింటా అన్నాడు.. తిరిగిరాలేదు : వాలీబాల్ ఆడుతూ గుండెపోటుతో విద్యార్థి మృతి

వాలీబాల్ ఆడుతూ ఇంటర్ విద్యార్థి మరణించిన సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ఆశ్వారావుపేట మండలం మల్లాయిగూడెం గ్రామానికి చెందిన రవికిరణ్ (16) ఇంటర్ పస్ట్ యర్ చదువుతున్నాడు. మంగళవారం (జూలై-24) మధ్నాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఫ్రెండ్స్ తో కలిసి వాలీబాల్ ఆడేందుకు స్టేడియానికి వెళ్లాడు. ఆట ఆడుతూనే ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. ఊహించని ఘటనతో ఫ్రెండ్స్ షాక్ కు గురయ్యారు. ఇంటికి తీసుకెళ్లి తట్టిలేపినా కోలుకోకపోవడంతో అశ్వారావుపేటలోని హస్పిటల్ కి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు డాక్టర్లు. హార్ట్ ఎటాక్ మరణానికి కారణం అని చెప్పారు. కుమారుడి చనిపోయాడని తెలియడంతో కన్నీరుమున్నీరయ్యారు.

అన్నం తినమంటే ఇప్పుడే వస్తానమ్మా.. వచ్చాక తింటానని చెప్పి ఇలా విగత జీవిగా కనిపించాడని తల్లడిల్లిపోయింది తల్లి. చివరిసారిగా అన్నం కూడా తినిపించలేకపోయా అంటూ ఆ తల్లి అంటుంటే.. అక్కడి వారికి కన్నీళ్లు ఆగలేదు. అయినా 16 ఏళ్ల కుర్రోడు.. ఆటల్లో చురుగ్గా ఉండే వాడు.. ఇలా గుండెపోటుతో చనిపోవటం ఏంటో అంటూ అందరూ కన్నీళ్లు పర్యంతం అయ్యారు. ఇప్పటి వరకు అనారోగ్యం అంటే ఏంటో తెలియని.. ఎంతో చలాకీగా ఉండే కుర్రోడు హార్ట్ ఎటాక్ తో చనిపోవటం ఏంటీ అంటూ అందరూ షాక్ అవుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates