వచ్చేస్తోంది.. వాట్సప్ లో డార్క్ మోడ్

ఇన్ స్టంట్ చాటింగ్ యాప్ వాట్సప్ లో మరో ఫీచర్ యాడ్ కానుంది. అదే డార్క్ మోడ్. రాత్రివేళ మొబైల్ ఫోన్ యూజ్ చేసేటప్పుడు డార్క్ మోడ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.  డార్క్ మోడ్ లో చాటింగ్ చేసేటప్పుడు బ్యాటరీ కూడా సేవ్ అవుతుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండు ప్లాట్ ఫామ్ లపైనా డార్క్ మోడ్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. డేట్ ఫిక్స్ చేయలేదు కానీ… ఈ ఏడాది చివర్లో గానీ… వచ్చే ఏడాది జనవరిలో గానీ.. మీ స్మార్ట్ ఫోన్ లోని వాట్సప్ యాప్ కు డార్క్ మోడ్ అప్ డేట్ వచ్చే అవకాశం ఉంది.

నైట్ టైమ్ లో చాటింగ్ చేసేవాళ్లు స్మార్ట్ ఫోన్ బ్రైట్ నెస్ తగ్గించుకుంటుంటారు. చీకట్లో చాటింగ్ చేసేటప్పుడు బ్యాక్ గ్రౌండ్ లైటింగ్ కారణంగా కళ్లపై ఎఫెక్ట్ పడుతుంది. డార్క్ మోడ్ లో చాటింగ్ చేస్తే కళ్లపై ప్రభావం తగ్గుతుంది. సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు ట్విట్టర్, యూట్యూబ్ లలో డార్క్ మోడ్ ఇప్పటికే వచ్చేసింది.

Posted in Uncategorized

Latest Updates