వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను ప్రజలు ఎన్ కౌంటర్ చేస్తారు : జగదీష్ రెడ్డి

jagadishreddy10రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు మంత్రి జగదీష్ రెడ్డి. SC  ప్రత్యేక అభివృద్ధి నిధిపై సోమవారం (ఫిబ్రవరి-12) సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఒక్క నల్లగొండలోనే ఎందుకు హత్యలు జరుగుతున్నాయని.. శ్రీనివాస్ కు ప్రమాదం ఉందని చెబుతున్న నేతలు, ఏ రోజైనా పిటిషన్ ఇచ్చారా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను ప్రజలు ఎన్ కౌంటర్ చేస్తారన్నారు.

ఈ ఆర్థిక సంవత్సరం పూర్తి కావడానికి మరో 50 రోజుల గడువు ఉందన్నారు. 45 నుంచి 50 రోజుల్లో షెడ్యూల్డ్‌కులాల ప్రత్యేక నిధి ఖర్చు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రణాళిక ప్రకారం నిధులు ఖర్చులు పెడితే సులువుగా లక్ష్యాన్ని చేరుకుంటామని చెప్పారు. నిధులు మురిగిపోకుండా అధికారులు పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగానే కేసీఆర్ ఈ చట్టాన్ని తీసుకువచ్చారని గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేరయ్యే SC విద్యార్థుల కోసం స్టడీ సర్కిళ్లలో ఉచితంగా కోచింగ్ ఇస్తున్నామన్నారు  మంత్రి జగదీష్‌రెడ్డి.

Posted in Uncategorized

Latest Updates