వచ్చే ఏడాది కపిల్ బయోపిక్

ranveer-singh-kapilబయోపిక్ ల ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. నిర్మాతలు కూడా రియల్ స్టోరీలను నిర్మించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటి వరకు టీమిండియా ఆటగాళ్లు ధోనీ, సచిన్‌  టెండూల్కర్ల బయోపిక్ లు రిలీజ్ అయ్యాయి. ఇందులో భాగంగానే ఇండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ బయోపిక్ ‘83’ ని నిర్మించారు. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న కపిల్‌దేవ్‌ బయోపిక్‌ ‘83’ వచ్చే ఏడాది విడుదల కానుంది. కబీర్‌ ఖాన్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో కపిల్‌ దేవ్‌ పాత్రలో బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ నటిస్తున్నాడు. గతేడాది ఆగస్టు 30న ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి సినిమా టీం ప్రపంచకప్‌ అందుకున్న ఆటగాళ్లను ఆహ్వానించింది. అప్పుడే సినిమా పేరును ‘83’గా ప్రకటించిన చలనచిత్ర బృందం సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేస్తున్నట్లు తెలిపింది.

ఇప్పటి వరకు కపిల్ బయోపిక్ సినిమా షూటింగ్‌ ప్రారంభం కాలేదు. ఈ ఏడాది మధ్య నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Posted in Uncategorized

Latest Updates