వచ్చే ఏడాది నుంచి డిగ్రీలో కొత్త సిలబస్‌

వచ్చే ఏడాది డిగ్రీ సిలబస్‌ మరోసారి మారబోతోంది. సిలబస్ మార్పుకు సంబంధించి రాష్ట్ర ఉన్నత విద్యామండలి త్వరలో ఓ కమిటీని వేయనుంది. రాష్ట్రంలోని ఆయా యూనివర్సిటీల పరిధిలో మూడేళ్ల కోసారి సిలబస్‌ మారుస్తుంటారు. చివరగా 2016లో డిగ్రీ సిలబస్‌లో మార్పులు చేశారు. గతేడాది కేంద్రం ఆధీనంలోని యూనివర్సిటీ  గ్రాంట్స్‌‌‌‌‌‌‌‌ కమిటీ (యూజీసీ) దేశవ్యాప్తంగా ఒకే సిలబస్‌ ఉండేలా న్యూ ఎడ్యుకేషన్‌పాలసీ తీసుకొచ్చింది.

అందులో బీజేపీ అనుకూల భావజాలం ఉందని విమర్శలొచ్చాయి. దీనిపై అప్పట్లో వెనక్కి తగ్గిన కేంద్రం.. తాజాగా పాలసీలో కొన్ని మార్పులు చేసి 2019-20 నుంచి కొత్త సిలబస్‌ అమలు చేయాలని రాష్ట్రాలకు సూచించింది. దీంతో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇటీవల వీసీలతో మీటింగ్‌ నిర్వహించి సిలబస్ మార్పు కోసం వీసీలు, సబ్జెక్ట్‌‌‌‌‌‌‌‌ ఎక్స్ పర్ట్స్ తో కమిటీ‌‌ వేయాలని నిర్ణయించింది.

Posted in Uncategorized

Latest Updates