వచ్చే నెల 14న హాజ‌రు కావాలి: శ‌శిథ‌రూర్‌కు కోల్ క‌తా కోర్టు ఆదేశాలు

కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్‌కి కోల్‌కతా కోర్టు నోటీసులు జారీ చేసింది. ‘హిందూ పాకిస్తాన్’ అంటూ ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలపై కోల్‌కతాకి చెందిన న్యాయవాది సుమీత్ చౌధురి ఫిర్యాదు చేశారు. ‘శశి థరూర్ దేశ ప్రజల మత విశ్వాసాలను గాయపర్చేలా మాట్లాడంతో పాటు… రాజ్యాంగాన్ని కూడా అవమానించారన్నారు. ఆయన వ్యాఖ్యలు మతాల మధ్య చిచ్చుపెట్టి ఘర్షణలు, ఉద్రిక్తతలు సృష్టించేలా ఉన్నాయంటూ పిటిషనర్ తెలిపారు.

దీంతో శశిథరూర్‌పై ఐపీసీ సెక్షన్ 153A, 295A లకింద కేసు నమోదు చేశారు. వచ్చే నెల 14న శశిథరూర్ విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.

Posted in Uncategorized

Latest Updates