వజ్రమే ఉంగరం: ధర రూ.1.8 కోట్లు

డైమండ్ రింగ్…ఇది వజ్రాలు పొదిగిన ఉంగరం కాదు. ఒకే ఒక్క పెద్ద డైమండ్ కోసి తయారు చేసిన వజ్రపుటుంగరం. ఈ ఉంగరాన్ని బుధవారం వేలం వేశారు. ఈ వేలంలో రూ.1,81,87,520 పలికింది. దీన్ని యాపిల్ కంపెనీ చీఫ్ డిజైన్ ఆఫీసర్ జోనీ ఇవ్, ఇండస్ట్రియల్ డిజైనర్ మార్క్ మ్యాసన్ డిజైన్ చేశారు. ఒక్క డైమండ్ తోనే దీన్ని తయారు చేసినా ఎన్నో డైమండ్స్ పొదిగినట్టు కనిపించేలా తయారు చేయడమే విశేషం. శాన్ ఫ్రాన్సిస్కో లోని వజ్రాల కటింగ్ సంస్థ  డైమండ్ ఫౌండ్రీ దీన్ని తయారు చేసింది.సోత్నబీ అనే వేలం సంస్థ డైమండ్ రింగ్ ను వేలం వేసింది. ఈ వేలంలో వచ్చిన  డబ్బును ఎయిడ్స్ బాధితుల కోసం వినియోగించనున్నారు.

Posted in Uncategorized

Latest Updates