వజ్రాల వ్యాపారి కొడుకు: 12 ఏళ్లకే సన్యాసం

jain-monkకోట్లాది రూపాయాల వ్యాపారానికి వారసుడైన 12 ఏళ్ళ భవ్య షా జైన సన్యాసిగా మారాలని నిర్ణయం తీసుకొన్నాడు. ఈ నిర్ణయంపై కుటుంబ సభ్యులు కూడ సంతృప్తిని వ్యక్తం చేశారు. భగవంతుడు చూపిన సత్యమార్గంలోనే పయనించాలని తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి దీపేష్‌షా కొడుకు భవ్య షా. వయసు 12 ఏళ్లు. వజ్రాల వ్యాపారం చేస్తున్న ఆ కుటుంబానికి ఎలాంటి కష్టాలు కూడ లేవు. అయితే భవ్యషా జైన సన్యాసిగా మారాలని తన అభిప్రాయాన్ని కుటుంబసభ్యులకు తెలిపాడు.

ఈ నిర్ణయంపై ఆ కుటుంబ సభ్యులు కూడా పెద్దగా ఆశ్చర్యపోలేదు. కొడుకు తీసుకొన్న నిర్ణయంపై తండ్రి దీపేష్‌ షా హర్షం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులను విడిచి వెళ్తున్నాననే బాధ కొంత ఉందన్నాడు భవ్య షా. అయితే భవిష్యత్తులో వారు కూడ తన బాటలనే పయనిస్తారన్నాడు. గతంలో కూతురు కూడ 12 ఏళ్ళ వయస్సులోనే జైన సన్యాసిగా మారింది.

Posted in Uncategorized

Latest Updates