వడ్డీ రేట్లు పెంచిన RBI : EMI అమౌంట్ పెరిగింది చూసుకోండి

RBI INTREST HIKEవడ్డీ రేట్లు పెంచింది రిజర్వ్ బ్యాంక్. రెపో రేటుపై 25 బేసిస్ పాయింట్లు పెంచుతూ బుధవారం (జూన్-6) నిర్ణయం తీసుకుంది. దీంతో 6 నుంచి 6.25 శాతానికి రెపో రేటు పెరిగింది. మానిటరింగ్ పాలసీ తర్వాత RBI నిర్ణయాన్ని ప్రకటించారు గవర్నర్ ఉర్జిత్ పటేల్. రెపో రేటును ఆర్బీఐ పెంచడం నాలుగేళ్లలో ఇది తొలిసారి. రెపో రేటు పెంచడంతో.. రుణాలు మరింత ప్రియం కానున్నాయి. హోమ్ లోన్లు, కార్ లోన్లపై వడ్డీ మరింత భారం కానుంది. ఇవాల్టి నుంచి మంత్లీ కట్టే బ్యాంక్ అప్పు పెరగనుంది. బ్యాంక్ అప్పులపై వడ్డీ రేట్లు పెంచటం మోడీ సర్కార్ వచ్చిన తర్వాత ఇదే. ఇప్పటికే SBI, ICICI, PNB బ్యాంకులు జూన్ ఒకటో తేదీ నుంచే వడ్డీ రేట్లను పెంచాయి. కొన్ని బ్యాంకులు డిపాజిట్ రేట్లను కూడా పెంచటం ఇప్పటికే జరిగిపోయింది.

ప్రస్తుతం ప్లోటింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ నెల నుంచి ఈఎంఐ పెరుగుతుంది. అంటే ప్రతి వెయ్యి రూపాయల EMIపైనా రెండున్నర రూపాయలు అదనంగా కట్టాల్సి ఉంటుంది. అంటే 10వేలు ఈఎంఐ కడుతుంటే.. 25 రూపాయలు వడ్డీ అదనంగా కట్టాల్సి ఉంటుంది. 2018-19  మొదటి అర్థ భాగంలో ద్రవ్యోల్బణం  4.8 నుంచి 4.9 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది రిజర్వ్ బ్యాంక్. రెండో అర్థ భాగంలో 4.7గా ఉండొచ్చన్నారు RBI గవర్నర్. ఇక తొలి ఆరు నెలల్లో జీడీపీ 7.5 శాతం నుంచి 7.6 శాతం వరకు ఉండొచ్చని.. రెండో అర్థ భాగంలో 7.3 శాతం నుంచి 7.4 శాతంగా ఉండొచ్చని రిజర్వ్ బ్యాంక్ అంచనా వేసింది.

Posted in Uncategorized

Latest Updates