వడ్డీ వ్యాపారం పేరుతో మోసం..మాజీ SI అరెస్ట్

ED-160218-XPOLICE-VIS-3హైదరాబాద్ లో వడ్డీ వ్యాపారం పేరుతో డబ్బులు వసూళ్లు చేసి మోసాలకు పాల్పడుతున్న.. మాజీ ఎస్సై గోపాల్ కృష్ణను శుక్రవారం (ఫిబ్రవరి-16) అరెస్ట్ చేశారు చైతన్యపురి పోలీసులు.  గోపాల్ కృష్ణ మరో ముగ్గురితో కలిసి తన్వయి క్రియేషన్స్ పేరుతో వడ్డీ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టిస్తూ మోసాలకు పాల్పడుతున్నాడు. ఇప్పటి వరకు మూడున్నర కోట్ల రూపాయల మోసాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. దీంతో ముగ్గురిపై చీటింగ్ కేసు పెట్టి.. అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుల నుంచి 13లక్షల 60వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

గోపాల్ కృష్ణ 2006లో మాల్కాజ్ గిరిలో కానిస్టేబుల్ గా చేశాడు. 2009లో మాస్ కాపీయింగ్ కు పాల్పడి ఎస్సైగా సెలక్ట్ అయ్యాడు. అయితే ట్రైనింగ్ లో గోపాల్ కృష్ణపై అనుమానం రావడంతో సీఐడీతో విచారణ జరిపించారు పోలీసులు. మాస్ కాపీయింగ్ పాల్పడినట్లు తేలడంతో విధుల నుంచి తొలగించారు.  దీంతో 2016 నుంచి వడ్డీ వ్యాపారంతో మోసాలు చేస్తున్నాడు గోపాల్ కృష్ణ.

 

Posted in Uncategorized

Latest Updates