వణికిన ఇండోనేషియా దీవులు: భూకంప తీవ్రత 5.9

ఇండోనేషియాలో ఇవాళ (మంగళవారం,అక్టోబర్-2) మరోసారి భూకంపం వచ్చింది. దక్షిణ తీరమైన సుంబా దీవుల్లో 5.9 తీవ్రతతో భూకంపం నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. సుంబాకు 40 కిలోమీటర్ల దూరంలో దాదాపు 10 కిలోమీటర్ల లోతులో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ దీవిలో సుమారు 7 లక్షల 50 మంది ప్రజలు ఉన్నారు. గత శుక్రవారం సులవేశి దీవుల్లో ఏర్పడిన భూకంపం, సునామీ కారణంగా 800 మందికిపైగా చనిపోయారు. అతలాకుతలమైన పాలూ నగరంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వేలాది మందిని సామూహిక ఖననం చేస్తున్నారు. అయితే సుంబా, సులవేశీ తీరాలకు సుమారు 1600 కిలోమీటర్ల దూరం ఉంది.

Posted in Uncategorized

Latest Updates