వణికిస్తున్న నిఫా వైరస్ : నర్సు లినీ సేవలు మర్చిపోలేనివన్న కేరళ ప్రభుత్వం

nifaప్రస్తుతం కేరళని నిఫా వైరస్ వణికిస్తుంది. నిఫా వైరస్ దెబ్బకి కేరళలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ వ్యాధి సోకిన వారికి ట్రీట్ మెంట్ చేస్తున్న నర్సులకు కూడా ఈ వైరస్ సోకటం ఇప్పుడు కేరళలో కలకలం సృష్టిస్తుంది. నిఫా వైరస్ వ్యాధి సోకిన వారికి ట్రీట్ మెంట్ చేస్తున్న సమయంలో కోజికోడ్ పరంబ్ర తాలూక్ హాస్పిటల్ లో నర్సుగా పనిచేస్తున్న లినీకి కూడా ఈ వైరస్ సొకింది. నిఫా వైరస్ సోకడంతో లినీ మరణించింది. అయితే లినీ శవాన్ని కూడా బంధువులు చివరిచూసే అవకాశం కూడా లేకుండా పోయింది. వైరస్ వ్యాప్తి చెందుతుందనే ఉద్దేశంతో తన మృతదేహాన్ని వెంటనే కాల్చేయని లినీ చెప్పడంతో ఆమె మృతదేహాన్ని అధికారలు కాల్చేశారు. అయితే లినీ సేవలు మర్చిపోలేనివని కేరళ ప్రభుత్వం తెలిపింది. లినీ భర్తకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. లినీ ఇద్దరి కుమారులకు ఒక్కొక్కరి 10 లక్షల రూపాయల చొప్పున 20 లక్షల రూపాయలను ఇస్తున్నట్లు తెలిపింది. అంతేకాకుండా నిఫా వైరస్ భాధిత కుటుంబాలకు నష్టపరిహారం కింద 5 లక్షల రూపాయలను ఇస్తున్నట్లు కేరళ ప్రభుత్వం తెలిపింది. అయితే లినీ కుటుంబానికి ఎంత ఇచ్చినా తక్కువేనని, ఆమె కుటుంబానికి ఎటువంటి ఇబ్బందిరాకుండా పూర్తిగా ప్రభుత్వమే భాధ్యత వహించాలని కేరళ ప్రజలు కోరుతున్నారు. చనిపోయే ముందు భావోద్వేగంతో లినీ తన భర్తకు రాసిన లేఖ ఇప్పుడు అందరి కళ్లల్లో నీళ్లు తెప్పిస్తుంది.

Posted in Uncategorized

Latest Updates