వదంతులను నమ్మి: హిజ్రాలపై దాడి.. ఒకరు మృతి

hejraపిల్లలను ఎత్తుకెళ్లే ముఠాలు వచ్చాయంటూ హైదరాబాద్ చాంద్రాయణ గుట్టలో హిజ్రాలపై రాళ్ల దాడి చేశారు స్థానికులు. ఈ దాడిలో ఓ హిజ్రా చనిపోయాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపై దాడికి దిగారు స్థానికులు. పోలీసులకూ గాయాలయ్యాయి.
రాత్రి చంద్రాయణ గుట్ట దగ్గర డబ్బులు అడుక్కుంటున్న హిజ్రాలతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. పిల్లలను ఎత్తుకపోవడానికి వచ్చారంటూ అందరూ కలిసి హిజ్రాలపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపై రాళ్లు విసిరారు. దీంతో పెట్రోలింగ్ వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. రాళ్ల దాడిలో ఓ ఇస్పెక్టర్, ఎస్సై తో పాటు మరొకొందరు కానిస్టేబుళ్లు కూడా గాయపడ్డారు.

Posted in Uncategorized

Latest Updates