వదంతులు నమ్మొద్దు : షెడ్యూల్ ప్రకారమే TRT ఎగ్జామ్

GANTAసోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దన్నారు TSPSC చైర్మన్ ఘంటా చక్రపాణి. పరీక్ష పుకార్లపై క్లారిటీ ఇస్తూ బుధవారం (ఫిబ్రవరి-21) ప్రెస్ మీట్ లో మాట్లాడారు.  షెడ్యూల్ ప్రకారమే TRT ఎగ్జామ్ ఉంటుందన్నారు.
అభ్యర్థుల రిక్వెస్ట్ మేరకు దగ్గరలోని HMDA పరిదిలో ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. ఏ జిల్లా వారికి ఆ జిల్లాలోనే పరీక్షా సెంటర్లు ఉంటాయన్నారు. ఫిబ్రవరి- 23 పరీక్షకు సంబంధించి హాల్ టికెట్లు డౌన్ లోడు అవుతున్నాయని, ఫిబ్రవరి- 24వ తేదీకి సంబంధించిన హాల్ టికెట్లు గురువారం (ఫిబ్రవరి-22) నుంచి తీసుకోచ్చన్నారు. ఇప్పటివరకు అయితే ఎలాంటి ఇబ్బందిలేదని, అభ్యర్థులు అనుకున్న సమయానికే పరీక్ష ఉంటుందన్నారు. అప్లికేషన్ ప్రజెంటేషన్ ప్రకారమే హాల్ టికెట్లు పంపిణీ చేశామన్నారు. 15 ఫిబ్రవరిన హాల్ టికెట్స్ ఏడు రకాలుగా జారీ చేశామన్నారు.

అయితే సెంటర్లు దూరంగా ఉన్నాయని అభ్యర్థుల నుంచి రిక్వెస్టులు వచ్చాయని, డేటా చూసి కొత్త సెంటర్లను అప్డేడ్ చేశామన్నారు. ఇప్పటివరకు లాంగ్వేజ్ పండిట్ అభ్యర్థులు 9 వేల మంది హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకున్నారని తెలిపారు. టెక్నికల్ సమస్యతో మొదట్లో కొంత ఇబ్బందులు ఎదురయ్యాయని, ఇప్పుడు అలాంటి సమస్యలు లేవన్నారు. CGG సమన్వయంతో పనిచేస్తున్నామన్నారు. అభ్యర్థులు గందరగోళంలో ఉన్న క్రమంలో హెల్ఫ్ డెస్క్ ను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు TSPSC చైర్మన్ ఘంటా చక్రపాణి.

Posted in Uncategorized

Latest Updates