వద్దన్నా వదలరు : ఇంటర్ వరకు తెలుగు చదవాల్సిందే

teluguతెలంగాణ ప్రభుత్వం 2018-19 విద్యా సంవత్సరం నుంచి ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు తెలుగు భాషను తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేయబోతున్నది. తెలుగు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్  తీసుకురావాలని నిర్ణయించింది. ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై ముసాయిదా సోమవారం (ఫిబ్రవరి 12) ఆమోదం కోసం న్యాయ మంత్రిత్వ శాఖకు వెళ్లింది. CBSE, ICSE, IB సహా అన్ని స్కూల్స్ ఆర్డినెన్స్ పరిధిలోకి తీసుకు వస్తున్నారు.

మార్చిలో CBSE, ICSE,  పాఠశాలల కోసం కొత్త విద్యా సంవత్సరం మొదట్లోనే ఆర్డినెన్సును తీసుకురావాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ ఆర్డినెన్స్ సభలో పెట్టాలని నిర్ణయించారు. మార్చి చివరి నాటికి ఆర్డినెన్స్ కు ఆమోదం లభించనుంది.

ఇక స్కూల్స్ లో తెలుగు బోధించడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవటానికి తగినంత సమయం కూడా ఇవ్వాలని నిర్ణయించారు. హడావిడిగా చివరి నిమిషంలో పాఠశాల నియమావళిలో మార్పులు చేస్తే.. చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంటుందని.. అలాంటివి ఏమీ లేకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని సర్కార్ నిర్ణయించింది. రాష్ట్రంలో CBSE,  ICSE  స్కూల్స్ ఇప్పటికే తెలుగును ఆప్షన్ గా అందిస్తున్నాయి. ఇప్పుడు తప్పనిసరి కాబోతున్నది. అయితే IB (ఇంటర్నేషనల్ బాకలారియాట్) స్కూల్స్  సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ విషయంలోనూ ఆర్డినెన్స్ ద్వారా పరిష్కారం లభించనుంది.

Posted in Uncategorized

Latest Updates