వనక్కం వండర్ : చైనా అమ్మాయి తమిళ రిపోర్టింగ్

విదేశీ భాషలు నేర్చుకోవటం ఆషామాషీ కాదు. ఒక వేళ నేర్చుకున్నా స్పష్టంగా తన భావం వ్యక్తం చేయటం చాలా చాలా కష్టం. అది చాలా కొద్దిమందికి మాత్రమే సాధ్యం. ముఖ్యంగా చైనీయులు అయితే తమ భాషకే ప్రాధాన్యం ఇస్తారు. ఇంటర్నెట్ కూడా వారి భాషలోనే ఉంటుంది. అందుకే ఐటీలో వెనకబడ్డారు అంటారు అందరూ. ఇప్పుడు చైనీయులు విదేశీ భాషలపై పట్టుసాధిస్తున్నారు. అందుకు ఈ రిపోర్టింగ్ ఉదాహరణ.

మోనికా అనే చైనా యువతి.. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా గురించి వివరిస్తూ ఉంటంది. అదీ తమిళ భాషలో. చాలా స్పష్టంగా ఎక్కడా తేడా రాకుండా.. అనర్గళంగా 3 నిమిషాలు వివరిస్తూ ఉంటుంది. మధ్యలో గొడ, దాని వెనక ఉన్న కొండ గురించి చెబుతూ ఉంటుంది. టూరిజం గైడ్ లో భాగంగా ఈ వీడియో చిత్రీకరించింది. ఈ చైనా యువతి, తమిళ భాషలో వివరించిన విధానానికి తమిళులు ఫిదా అయిపోయారు. మాతృభాషలో కాకుండా ఇతర భాషలో ఇంత స్పష్టంగా వివరించటం అంతా ఈజీ కాదంటూ మహీంద్రా కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ద్వారా ఈ వీడియో షేర్ చేశారు. అంతే కాకుండా గ్రేట్ వాల్ ఆఫ్ తమిళ్ అంటూ కీర్తించటంతో.. తమిళులు ఆనందానికి అవదుల్లేవు. ఈ వీడియో ఇప్పుడు ప్రతి తమిళ వ్యక్తి పడిపడి చూసేస్తున్నారు. వైరల్ అయిపోయింది.

Posted in Uncategorized

Latest Updates