వనపర్తిలో 36 అడుగుల శివుడి విగ్రహం

SIVAతెలంగాణ రాష్ట్రంలో ఓ భారీ శివుడి విగ్రహం నిర్మితమవుతోంది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పామాపురం గ్రామంలోని ఊకచెట్టువాగులో ఈ విగ్రహాన్ని తయారుచేస్తున్నారు. BRR చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 36 అడుగుల భారీ శివుడి విగ్రహం ఏర్పాటుచేస్తున్నారు. చుట్టూనీరు మధ్యలో పెద్ద శివుడి విగ్రహం జనాన్ని ఆకట్టుకుంటోంది.

శివుడి విగ్రహంతో ఆ గ్రామం పర్యాటక ప్రాంతంగా తయారవుతుందంటున్నారు స్థానికులు.  త్వరలోనే పనులను పూర్తి చేసి, ప్రజలకు శివడిని దర్శించుకునేందుకు వీలు కల్పిస్తామని తెలిపారు ట్రస్టు నిర్వాహకులు.

Posted in Uncategorized

Latest Updates