వన్డే ట్రై సిరీస్ : వెస్టిండీస్ పై భారత్ గ్రాండ్ విక్టరీ

Mayank Agarwalట్రై సిరీస్ లో భాగంగా సోమవారం (జూన్-25) వెస్టిండీస్ A టీమ్ తో జరిగిన వన్డే మ్యాచ్ లో భారత్ A టీమ్ 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండిస్ ..49.01 ఓవర్లలో 221 రన్స్ చేసి ఆలౌట్ అయ్యింది. వెస్టిండీస్ ప్లేయర్లలో థోమస్(64 నాటౌట్) , హేమ్రాజ్(45) తప్పా మిగతా ప్లేయర్లెవరూ రాణించలేకపోయారు. దీంతో తక్కువ స్కోరుకే ఆలౌటౌంది వెస్టిండీస్. భారత బౌలర్లలో దీపక్ చాహర్( 5) వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన భారత్ ..38.01 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసి విజయం సాధించింది. భారత ప్లేయర్లలో మయాంక్ అగర్వాల్ (112) సెంచరీతో ఆకట్టుకున్నాడు.

Posted in Uncategorized

Latest Updates