వన్ డాలర్ = రూ.74.45 పైసలు

ముంబై : మన రూపాయి అంతర్జాతీయంగా మరింత విలువ కోల్పోయింది.  ఇవాళ(అక్టోబర్ 11) మరో 24 పైసలు పడిపోయింది.. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.45కు చేరి… కొత్త లైఫ్ టైమ్ కనిష్టాన్ని తాకింది.  అమెరికా కరెన్సీకి పెరుగుతున్న డిమాండ్‌, ద్రవ్యలోటు పెరుగుతుందన్న అంచనాల కారణంగా.. దేశీయ కరెన్సీ విలువ దారుణంగా పడిపోతోంది. ఫారెక్స్‌ ట్రేడింగ్‌ ఆరంభంలోనే రూపాయి మారకం విలువ పతనమై రూ.74.37 దగ్గర ప్రారంభమైంది. కొద్దిసేపటికే మరింత తగ్గి.. జీవనకాల కనిష్టం రూ.74.45పైసలకు చేరింది.

స్టాక్‌మార్కెట్లు కూడా భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్‌ 818 పాయింట్ల నష్టంతో 33,942 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీ 256పాయింట్లు నష్టపోయి 10,204 పాయింట్లపై ట్రేడవుతోంది.

Posted in Uncategorized

Latest Updates