వన్ నేషన్.. వన్ డ్రైవింగ్ లైసెన్స్

దేశ వ్యాప్తంగా జూలై,2019 నుంచి ఒకే డ్రైవింగ్ లైసెన్స్ విధానం అమల్లోకి రానుంది. దీంతో రవాణా శాఖ అధికారులు కొత్త డ్రైవింగ్ లైసెన్స్,వెహికల్ రిజిస్ర్టేషన్ సర్టిఫికేట్స్(RC) జారీ చేయనున్నారు. కొత్తగా జారీచేసే స్మార్ట్ కార్డులపై మైక్రోచిప్, క్యూఆర్ కోడ్‌లను ముద్రించనున్నారు. కార్డ్ డీటెయిల్స్ ను వేగంగా గుర్తించడానికి వీటిలో నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్‌ఎఫ్‌సీ) ఫీచర్‌ను ఇన్‌స్టాల్ చేయనున్నారు. ఇండియన్ యూనియన్ డ్రైవింగ్ లైసెన్స్ పేరుతో అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకే కలర్,డిజైన్,సెక్యూరిటీ ఫీచర్లతో దీన్ని జారీ చేస్తారు.

వెహికల్ డ్రైవర్ పేరు, బ్లడ్ గ్రూప్, అవయవదానం చేస్తామంటూ ఇచ్చే డిక్లరేషన్ వివరాల్ని కూడా కొత్త డ్రైవింగ్ లైసెన్స్‌ పై ప్రింట్ చేస్తారు. ఒకవేళ దివ్యాంగులైతే వారి కోసం ప్రత్యేకంగా తయారుచేసిన వాహనం ఉంటే ఆ వివరాల్ని కార్డుపై ముద్రిస్తారు. వీరందరికీ కొత్తగా ప్రవేశపెట్టే లైసెన్సులు, ఆర్సీలను రవాణాశాఖ జారీచేయనున్నది. ఈ స్మార్ట్ కార్డుల ప్రక్రియ నిరంతరం సాగుతుందని రవాణాశాఖ ఉన్నతాధికారి తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియను కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వశాఖ ఇప్పటికే ప్రారంభించిందని చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates