వయస్సు గుర్తు చేసిన చిన్నారి : పెద్దమ్మ అయిన కాజల్ అగర్వాల్

kajalటాలీవుడ్ ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ ఇప్పుడు పెద్దమ్మ అయ్యారు. బుధవారం (ఫిబ్రవరి 21)  కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్ బాబుకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కాజల్‌ తన ట్విటర్‌ ద్వారా తెలుపుతూ.. బాబుని ఎత్తుకుని ముద్దాడుతున్న ఫొటోను షేర్‌ చేశారు. రాత్రంతా మేల్కోవాల్సి వచ్చింది, మా చిన్నారి ఇషాన్‌ వలేచాను చూశారా  అంటూ కాజల్‌ ట్వీట్‌ చేశారు. 2013లో వ్యాపారవేత్త కరణ్‌ వలేచాను వివాహం చేసుకున్న తర్వాత నిషా సినిమాలకు దూరమయ్యారు.

తన చెల్లెలు మగబిడ్డకు జన్మనివ్వటంతో ఉబ్బితబ్బివు అవుతోంది కాజల్. పెద్దమ్మను అయ్యాను అంటూ మురిసిపోతుంది. ప్రస్తుతం కాజల్ వయస్సు 33 సంవత్సరాలు. సినిమాల్లో బిజీగా ఉండటం వల్ల పెళ్లి చేసుకోలేదు.

Posted in Uncategorized

Latest Updates